News September 15, 2025
పోచారం ప్రాజెక్టులో నీట మునిగి యువకుడి మృతి

నాగిరెడ్డిపేట్(M) పోచారం ప్రాజెక్టులో నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్ గౌడ్ వివరాలు.. మెదక్‌కు చెందిన షేక్ మహబూబ్(20) తన స్నేహితునితో కలిసి ప్రాజెక్టు దిగువన ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో షేక్ మహబూబ్ నీట మునిగిపోయాడు. పోలీసులు చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 15, 2025
ఐజిని కలిసిన పల్నాడు ఎస్పీ

పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. కృష్ణారావు ఆదివారం గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఐజీ మాట్లాడుతూ.. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వసనీయత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఐజీ త్రిపాఠి అన్నారు.
News September 15, 2025
భీమవరం: ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాల చెల్లింపు

ప.గో జిల్లాలో ఉపాధి శ్రామికులకు వేతన బకాయిలు విడుదల అయ్యాయి. జిల్లాలోని 99 వేల మందికి గాను రూ.55 కోట్లు మేర వారి అకౌంట్లలో అధికారులు జమ చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు రాక శ్రామికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దసరా ముందు నిధులు విడుదల చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి నిధుల విడుదలలో జాప్యం కారణంగానే ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.
News September 15, 2025
వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.