News August 20, 2025
పోడు భూముల్లో ప్రకృతి వ్యవసాయం

పాచిపెంట మండలం కుడుమూరు ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల్లో పకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పంట పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. సుమారు 15 పంచాయతీలు ప్రజలు పోడు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొండలపై తుప్పలు తొలిగించి వ్యవసాయం చేస్తుంటారు. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలకు వరి పైరు మొత్తం పచ్చగా మారి ఆ ప్రాంతం అరకును తలపిస్తోంది.
Similar News
News August 20, 2025
SRD: ఐఐటీ హైదారాబాద్‌లో పీహెచ్‌డీ అడ్మిషన్లకు ఆహ్వానం

కందిలోని ఐఐటీ హైదారాబాద్‌లో కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంలో ప్రత్యేక రౌండ్ పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి స్పాన్సర్ చేసిన ప్రాజెక్టుల ద్వారా నిధులు సమకూరుతాయన్నారు. ఆసక్తి గలవారు సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు cse.iith.ac.in/admissions/phd లింకులో చూడాలని కోరారు.
-SHARE IT
News August 20, 2025
వాస్తు పేరుతో ఇంద్రకీలాద్రిలో కోట్లు స్వాహా?

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. సుమారు 2-3 లక్షల మంది వస్తారు. ప్రసాద భవనం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఓ ఇంజినీరింగ్ అధికారి, ఆలయ ఆస్థాన విధ్వాంసుడి నిర్వాకం వల్ల శాశ్వత భవనాలు నిర్మించలేదని ఆరోపణలున్నాయి. నిర్మాణాలు చేపట్టి వాస్తు దోషం పేరిట కూల్చివేయడం వల్ల కోట్లు దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
News August 20, 2025
HYD: ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్త: DCP

HYD నగర భవన యజమానులకు పోలీసులు పలు సూచనలు చేశారు. నివాస, వాణిజ్య భవనాలను నగరంలో రెంట్ కోసం ఇచ్చే ముందు యజమానులు నిబంధనలు పాటించాలని, అగ్రిమెంట్ చేసుకోవాలని సైబర్‌క్రైమ్ DCP శిల్పవల్లి తెలిపారు. ఖాళీ చేయించాల్సిన సమయంలో రెంటర్లకు నోటీసులు ఇవ్వాలని, కిరాయి సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవాలని సూచించారు.