News August 13, 2025
పోడూరు తహశీల్దార్‌కి కలెక్టర్ అభినందనలు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి రూ.లక్ష డ్రాఫ్ట్‌ను అందించిన పోడూరు తహశీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్‌ను జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అభినందించారు. తహశీల్దార్లందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి రెడ్ క్రాస్‌కు అందించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. రెడ్ క్రాస్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Similar News
News August 13, 2025
భీమవరం: సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్.

‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారంలో భాగంగా భీమవరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. అనంతరం ఆమె సెల్ఫీ దిగారు. ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని ఆమె కొనియాడారు.
News August 13, 2025
నేడు భీమవరంలో మాజీ సీఎం జగన్ పర్యటన

మాజీ సీఎం వైసీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి, విఎస్స్ గార్డెన్స్‌లో జరిగే వేడుకకు హాజరు అవుతారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
News August 12, 2025
నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలి: కలెక్టర్

చినఅమిరం జిల్లా పరిషత్ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కలెక్టర్ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. ఆమె విద్యార్థులకు స్వయంగా నులిపురుగుల మాత్రలు వేశారు. పిల్లలు ఈ మాత్రలు వేసుకోవడం ద్వారా రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని కలెక్టర్ సూచించారు. నులిపురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు.