News December 22, 2025
పోరాటానికి సిద్ధమైన విశాఖ ఉక్కు భూ నిర్వాసితులు

విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 4న పాత గాజువాకలో భారీ భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. సుమారు 8,500 మంది ఆర్-కార్డు దారులకు న్యాయం చేయాలని, మిగులు భూములను పంపిణీ చేయాలని నిర్వాసితుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. భూమి ఇచ్చే వరకు నెలకు రూ.25,000 భృతి చెల్లించాలని కోరుతూ 64 గ్రామాల నిర్వాసితులు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 23, 2025
వైద్యం ప్రైవేట్ పరమైతే ఊరుకోం: బొత్స

మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉంచాలన్నది తమ పార్టీ విధానమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో స్కాములకు పాల్పడితే వైసీపీ అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని విమర్శించారు.
News December 23, 2025
జనవరి నుంచి రేషన్ డిపోలో గోధుమపిండి: విశాఖ జేసీ

విశాఖలో అన్ని రేషన్ డిపోలలో జనవరి నెల నుంచి గోధుమపిండి పంపిణీ చేయనున్నట్లు జేసీ మయూర్ అశోక్ మంగళవారం తెలిపారు. బియ్యం, పంచదార, రాగులతో పాటు గోధుమపిండి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేజీ గోధుమపిండి రూ.20కి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News December 23, 2025
విశాఖలో రూ.27 కోట్ల జీఎస్టీ మోసం

విశాఖపట్నం డీజీజీఐ డిప్యూటీ డైరెక్టర్ శ్వేతా సురేష్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో రూ.27.07 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. ఎటువంటి వస్తు సరఫరా లేకుండా నకిలీ ఐటీసీని సృష్టించిన ఈ నెట్‌వర్క్ సూత్రధారి మల్లికార్జున మనోజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యల్లో భాగంగా విశాఖ జోనల్ యూనిట్ ఈ ఏడాది చేసిన నాలుగో అరెస్టు ఇది అని అధికార వర్గాలు తెలిపాయి.


