News January 11, 2025
పోరాట వీరుడు!

నేడు వడ్డే ఓబన్న జయంతి. ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మిన బంటు. ముఖ్య అనుచరుడిగా ఉంటూ ఉద్యమాలకు ఊపిరిపోశారు. ఓబన్న సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన వడ్డె సుబ్బయ్య, సుబ్బమ్మ దంపతులకు 1807 జనవరి 11న జన్మించారు. నరసింహారెడ్డి తాతది ఇదే గ్రామం కావడంతో ఇరు కుటుంబాలకూ సంబంధాలు ఉండేవి. 1846 అక్టోబరు 6న బ్రిటిష్ వారితో పోరాటంలో ఓబన్న 39ఏళ్లకే వీరమరణం పొందారు. ఆ తర్వాత నరసింహారెడ్డిని ఉరితీశారు.
Similar News
News February 23, 2026
ప్రజా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం: SP

పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 122 ఫిర్యాదులు అందాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించిన ఎస్పీ, ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని, ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేసిన ఘటనలు, ఫైనాన్స్ మోసాలు, బంగారు దుకాణ వివాదం వంటి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News February 23, 2026
ఇంటర్ పరీక్ష.. తొలిరోజు 823 మంది గైర్హాజరు: RIO

కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 823 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 26,925 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 26,102 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.
News February 23, 2026
కర్నూలు జిల్లాలో రైతులకు పుష్కలంగా యూరియా నిల్వలు

కర్నూలు జిల్లాలో సాగు అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి తెలిపారు. 2025-26 రబీ సీజన్ కోసం 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని ప్రణాళిక సిద్ధం చేశారు. యూరియాను అధిక ధరలకు అమ్మినా, ఇతర ప్రాంతాలకు తరలించినా డీలర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల కొరతపై ఫిర్యాదుల కోసం 8341302863 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.


