News December 1, 2025

పోలవరం ఆలోపే పూర్తి చేస్తాం: CM

image

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అని, ఆ ప్రాజెక్టు మనకు ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు మండలం నల్లమాడులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2027 నాటికి గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో గోదావరి, కృష్ణా డెల్టాలో నీటి ఎద్దడి సమస్యే ఉండదన్నారు.

Similar News

News December 3, 2025

అమరావతిలో NGO టవర్స్.. 1,995 ఫ్లాట్లు రెడీ.!

image

అమరావతిలో నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (NGO) టవర్స్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఏపీసీఆర్డీఏ పర్యవేక్షణలో మొత్తం 21 భారీ టవర్లను నిర్మిస్తున్నారు. స్టిల్ట్+12 అంతస్తులతో కూడిన ఈ ప్రాజెక్టులో ఏకంగా 1,995 ఆధునిక ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగులకు సౌకర్యవంతమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గ నివాసాలు కల్పించడమే దీని లక్ష్యం.

News December 3, 2025

చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా?

image

చిన్న వయసులోనే పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని USకు చెందిన NIH (National Institutes of Health) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 10,000 మందికి పైగా పిల్లలపై స్టడీ చేయగా.. 12 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఫోన్‌కు అలవాటు పడిన వారిలో డిప్రెషన్‌, నిద్రలేమి, ఒబేసిటీ, అలసట వంటి సమస్యలు పెరిగినట్లు గుర్తించింది. ఫోన్‌లో ఏం చేస్తారన్నది కాదని.. అది కలిగి ఉండటమే ప్రమాదకరమని హెచ్చరించింది.

News December 3, 2025

HYD: నేతలను వెంటాడుతున్న నిరుద్యోగం

image

ORR పరిధిలోని 20 పట్టణాలు, 7 నగరాలను GHMCలో విలీనం చేయనున్నారు. ఇది రాజకీయంగా ఎదగాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లింది. గ్రామంలో సర్పంచ్, వార్డ్ మెంబర్‌గా రాణిద్దామనుకునేలోపే మున్సిపాలిటీ చేశారు. తీరా పట్టణాలను బల్దియాలో విలీనం చేస్తుండడంతో రాజకీయ అవకాశాలు 30%పైగా తగ్గుముఖం పట్టనున్నాయి. నిరుద్యోగం విద్యార్థులనే కాదు.. నాయకులను సైతం వెంటాడుతోంది. మహా నగరంలో రాజకీయంగా ఎదగడం ఎలా? అని ఆలోచనలో పడ్డారు.