News December 31, 2025
పోలవరం ఇంఛార్జ్‌లుగా అల్లూరి జిల్లా అధికారులు

అల్లూరి జిల్లా అధికారులను నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లాకు ఇంఛార్జ్‌లుగా నియమించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ విజయానంద మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పడిన పోలవరం జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా ఏఎస్ దినేష్ కుమార్, ఇంఛార్జ్ ఎస్పీగా అమిత్ బర్ధర్, ఇంఛార్జ్ జేసీగా పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజను నియమించారు.
Similar News
News February 18, 2026
జగిత్యాల: ‘విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు’

రాబోయే SSC పరీక్షల సన్నద్ధతపై జగిత్యాల కలెక్టర్ సమావేశ మందిరంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)లతా ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరీక్షల నిర్వహణకు అన్ని శాఖలు సమర్థవంతంగా సిద్ధం కావాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సేవలు, రవాణా, విద్యుత్ సరఫరా, భద్రత, 144 సెక్షన్ అమలు వంటి అంశాలపై మాట్లాడారు.
News February 18, 2026
రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాగిరి: హరీశ్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు గుండాగిరి, అరాచక పాలన సాగుతోందని ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక చర్యలను అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసు, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. బల్క సుమన్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News February 18, 2026
రైతులందరికీ ‘డిజిటల్’ గుర్తింపు ఉండాల్సిందే: కలెక్టర్

జిల్లాలోని రైతులందరూ తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ చేయించుకోవాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 5.54 లక్షల మంది పట్టాదారులు ఉండగా, కేవలం 2.41 లక్షల మందే నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే ఈ నమోదు ఆవశ్యకమని, మీ-సేవ లేదా ఏఈఓల ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.


