News March 20, 2026

‘పోలవరం జిల్లాలో గ్యాస్ కొరత లేదు’

image

పోలవరం జిల్లాలోని 8గ్యాస్ ఏజెన్సీలలో 1872 వంట గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ విజయ భాస్కర్ శుక్రవారం తెలిపారు. రంపచోడవరంలో జీసీసీ గ్యాస్ గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ బుక్ ప్రకారం 352 సిలిండర్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. ఎటువంటి కొరతలేదని, బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. శుక్రవారం 352 మంది గ్యాస్‌ కోసం నమోదు చేసుకున్నారన్నారు.

Similar News

News April 13, 2026

‘B.Ed’ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

image

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.

News April 13, 2026

HYD: చనిపోతే ఆధార్ డీయాక్టివేట్ చేయండిలా

image

మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేసే విధానాన్ని UIDAI వెల్లడించింది. మీ సొంత ఆధార్ నంబర్ కానీ, కుటుంబ సభ్యులు ఆధార్ నంబర్‌తో My Aadhaar పోర్టల్‌లో లాగిన్ అయ్యి ‘Report Death Of A Family Member’ ఆప్షన్ ద్వారా మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు, డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం మరణ ధ్రువీకరణ పత్రం అప్‌లోడ్ చేస్తే, పరిశీలన అనంతరం ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తారు.

News April 13, 2026

ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంలో మన HYD TOP

image

దేశవ్యాప్తంగా ఈవీ వినియోగంలో హైదరాబాద్ మహానగరం 14% వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. నగరంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ- విటారా వాహనాలను ఇటీవలే భారీగా కొనుగోలు చేశారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో ఉండటంపై మరింత ఫోకస్ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.