News March 2, 2026
పోలవరం జిల్లాలో టెన్త్ పాస్ అయినవారికి గుడ్ న్యూస్

పోలవరం జిల్లాలో 10వ తరగతి ఆపై చదివిన వారికీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ట్రైనింగ్ ప్రోగ్రాం ఉందని ప్రిన్సిపల్ రవికుమార్ సోమవారం తెలిపారు. ఈ కామర్స్ డెలివరీ విభాగం, కస్టమర్ కేర్ విభాగాల్లో పనిచేసేందుకు 3 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఒక్కొక్క విభాగంలో 30 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఈనెల 19లోగా అప్లై చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 3, 2026
HNK: పోలీసుల ఎదుట లొంగిపోయిన వికాస్

జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన ముప్పిడి సాంబయ్య@వికాస్ మహాసముంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు 15 మంది మావోయిస్టు క్యాడర్ సైతం లొంగిపోయారు. వీరిపై రూ.73 లక్షల బహుమతి ఉంది. 3 AK-47లతో సహా 14 ఆయుధాలను పోలీసులకు సమర్పించారు. ప్రభుత్వ పునర్వాస విధానం కింద సమాజంలోకి తిరిగి చేరి అభివృద్ధి మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
News March 3, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయనగరంలోని వైష్ణవ వీధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నాయుడు ప్రసాద్ (43) సోమవారం తన సోదరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి కిందపడ్డారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో SI కమల్ భార్గవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News March 3, 2026
విశాఖ: బీచ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

ఆర్కేబీచ్‌లోని సుప్రీం హోటల్ ఎదురుగా అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జగదాంబ సమీపంలో నివాసం ఉండే ఎం.శ్రీధర్ (36)గా పోలీసులు గుర్తించారు. శ్రీధర్ కార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి బీచ్‌లో రాళ్ల మధ్య విగతజీవిగా పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


