News February 12, 2026

పోలవరం జిల్లాలో 29 PHCలకు నిధులు విడుదల

image

పోలవరం జిల్లాలో ఉన్న 29 PHCలకు ఒక్కో ఆసుపత్రికి రూ.2లక్షలు చొప్పున రూ.58 లక్షల నిధులను విడుదల చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి డా. సరిత తెలిపారు. ఈనెల 8న నిధులు వచ్చాయన్నారు. 15 లోపు ఆసుపత్రి నిధులు ఖర్చులు ట్రెజరీకి చూపి నిధులు వినియోగించాల్సి ఉందన్నారు. వాటికి మార్గదర్శకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News February 15, 2026

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్‌గా మూడ్‌ గణేష్‌..!

image

కొత్తగూడెం మేయర్‌ అభ్యర్థిగా సుజాతనగర్‌ 20వ డివిజన్‌ కార్పొరేటర్‌ మూడ్‌ గణేష్‌ పేరును సీపీఐ అధిష్ఠానం ఖరారు చేసింది. కాంగ్రెస్‌-సీపీఐ పొత్తులో భాగంగా మేయర్‌ పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడత అవకాశం సీపీఐకి దక్కింది. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఆయన అభ్యర్థిత్వానికే పార్టీ మొగ్గు చూపింది. త్వరలోనే ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 15, 2026

టమాటాలో కాయ తొలుచు పురుగును ఎలా నివారించాలి?

image

టమాటాను కాయ తొలుచు పురుగు ఆశించి తొలుత లేత ఆకులు, కొమ్మలను తిని తర్వాత కాయలను తొలిచి నాశనం చేస్తుంది. ఈ పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎర పంటగా బంతి మొక్కలను నాటాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ML లేదా స్పైనోసాడ్ 0.4ML కలిపి పిచికారీ చేయాలి.

News February 15, 2026

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులకు నోటిఫికేషన్

image

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 27 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి PG, PG(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd , MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://careers.amuonline.ac.in/