News January 1, 2026
పోలవరం జిల్లా ఇన్‌ఛార్జిగా ఏఎస్ దినేష్ కుమార్

పోలవరం జిల్లా ఇన్ ఛార్జి కలెక్టర్‌గా ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న దినేష్ కుమార్‌ను పోలవరం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రంపచోడవరం కలెక్టర్ కార్యాలయం లో బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. త్వరితగతిన అన్ని శాఖల కార్యాలయాల ఏర్పాటుపై దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు కలెక్టర్ సరికొత్త ఐడియా..!

<<18602332>>ఛాంపియన్ ఫార్మర్స్<<>> పేరిట నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా <<18725510>>మాట్లాడే <<>>వీలు కల్పించారు. చేపలు, రొయ్యలు, ఆక్వా సాగు సందేహాలపై మత్స్యశాఖ శాస్త్రవేత్త N.తీరజ(9866210891)కు ఉద్యాన పంటలు, విత్తనాల ఎంపికపై ఉద్యానవన శాఖ అధికారిణి లక్ష్మికి(7995088181) కాల్ చేయవచ్చు.
News January 2, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,140 పెరిగి రూ.1,36,200కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 ఎగబాకి రూ.1,24,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 పెరిగి రూ.2,60,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News January 2, 2026
కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి: బండి సంజయ్

TG: కృష్ణా జలాల వ్యవహారంలో కాంగ్రెస్, BRS తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై బురద జల్లుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైరయ్యారు. ‘కృష్ణా జలాల్లో 299 TMCలు చాలని KCR సంతకం చేసింది నిజమే. పాలమూరు ప్రాజెక్టుపై కేంద్రం అడిగిన నీటి వివరాలివ్వకుండా రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అందుకే DPRను కేంద్రం వెనక్కు పంపింది. చేసిన అన్యాయంపై కాంగ్రెస్, BRS క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు.


