News February 18, 2026
పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా విశ్వనాథ్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్) పోలవరం జిల్లా నోడల్ ఆఫీసర్‌గా రంపచోడవరం డ్వామా APD. విశ్వనాథ్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి గ్రీవెన్స్‌లో వచ్చిన ప్రతీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విశ్వనాథ్ అన్నారు. జేసీ స్మరణ్ రాజ్ ఆదేశాల మేరకు అధికారుల సహకారంతో గ్రీవెన్స్ నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News February 19, 2026
త్వరలో DSC.. కర్నూలు జిల్లాకు అధిక ప్రాధాన్యం: మంత్రి లోకేశ్

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని, యువగళం పాదయాత్రలో కళ్లారా చూశానని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో అన్నారు. ‘ఆ ప్రాంతాన్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాం. గత DSCలో ఆ జిల్లాకు ఎక్కువ మంది టీచర్లను నియమించాం. అయినా స్టూడెంట్, టీచర్ రేషియో తక్కువగా ఉంది. త్వరలో DSC ప్రకటించబోతున్నాం. జిల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని చెప్పారు.
News February 19, 2026
విశాఖలో AI హబ్: సుందర్ పిచాయ్

ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్‌లో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో గూగుల్ AI హబ్‌లను ఏర్పాటు చేస్తోందని కంపెనీ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. మానవాళికి AI చాలా ఉపయోగకరంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ AIని చాలా వేగంగా అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. కొత్త టెక్నాలజీని అందరికీ చేర్చడమే మోదీ లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News February 19, 2026
163 ఏళ్ల తర్వాత ఇలా.. మళ్లీ 2189లోనే!

ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతుల పండుగలు ఒకే సమయంలో రావడం చాలా అరుదు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్, క్రైస్తవ మతంలో ఈస్టర్ పండుగకు ముందు వచ్చే లెంట్, చైనీస్ ‘లూనార్ న్యూఇయర్’లు 1863లో 24 గంటల వ్యవధిలోనే ప్రారంభమయ్యాయి. మళ్లీ 163 ఏళ్ల తర్వాత 2026లో ఈనెల 17-18న ఇది ఆవిష్కృతమైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మళ్లీ ఇలాంటి వింతను చూడాలంటే 2189 వరకు వేచి చూడాలి.


