News February 9, 2026
పోలవరం జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావన వస్తుందా?

ఈ నెల 11వ తేదీ నుంచి AP అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. పోలవరం నష్ట పరిహారం R&R ఇంకా చాలామందికి జమ కాలేదు. పోలవరం జిల్లా ఏర్పడినా.. ఇంకా చాలా శాఖలకు అధికారుల నియామకం జరగలేదు. ఈ సమస్యలపై రంపచోడవరం MLA శిరీష దేవి అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో సమస్యలు, పర్యాటక అభివృద్ధికి చర్యలు గురించి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతున్నారు.
Similar News
News March 9, 2026
ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.
News March 9, 2026
పాలమూరు: డిగ్రీ కళాశాల.. కోర్సులు ఇవే

మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ Dr.జె.జయప్రద ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 1.B.Sc. (MPC/CS), 2.B.Sc.(MZC), 3.B.Sc. (MSCS/DS), 4.B.Com.(BA), 5.B.Sc.(BZC), 6.B.Com.(CA), 7.В.А.(HEP) కోర్సులు ఉన్నాయన్నారు. ఎన్ఎస్ఎస్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం ఉందన్నారు. అవసరమైన వారికి SHARE IT.
News March 9, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.


