News August 8, 2024
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయండి: ఎంపీ

పార్లమెంట్‌లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం ప్రసంగించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. పామాయిల్ రైతులకు ఏలూరు జిల్లాలో ఇంక్యుబేషన్ సెంటర్ నెలకొల్పాలన్నారు. దీనిపై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి జితిన్ రామ్ మాన్ జీ స్పందిస్తూ ఎంపీ కోరిన వాటిని పరిశీలిస్తామని చెప్పినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Similar News
News September 18, 2025
పాలకోడేరు: గల్లంతైన జైదేవ్ మృతదేహం లభ్యం

పాలకోడేరు మండలం వేండ్ర కట్టా వారిపాలెం గోస్తని నదిలో గల్లంతైన చిన్నారి జైదేవ్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన అతడి కోసం నాలుగు రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చేపట్టారు. వేండ్ర రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుర్రపుడెక్కల్లో చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News September 18, 2025
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్

ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. అనుకోకుండా ఉగ్రవాదులు దాడులు జరిపినప్పుడు సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్ చేశారు. ఆలయంలోనూ, కొండపైన, పరిసరాల్లో ఆక్టోపస్, పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, వైద్య, దేవస్థానం సిబ్బంది ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.
News September 18, 2025
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. జేసీ హెచ్చరిక

భీమవరంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రీ-సర్వే, పీజీఆర్ఎస్, ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. ముఖ్యంగా పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా మాట్లాడి పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.