News December 19, 2025
పోలవరం పెండింగ్ అనుమతులివ్వండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్‌ను CM చంద్రబాబు కోరారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో గంటపాటు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అనుమతులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని చూస్తోందని, భూసేకరణకు సిద్ధమైందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.
Similar News
News December 19, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు

ఏపీ ఇంటర్ బోర్డు రెండు పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. మ్యాథ్స్ పేపర్ 2A, సివిక్స్ పేపర్ 2లను మార్చి 4న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 3) నిర్వహిస్తామని ప్రకటించింది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్1, లాజిక్ పేపర్1 మార్చి 21న (పాత షెడ్యూల్ ప్రకారం మార్చి 20) ఉంటాయని తాజాగా వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
News December 19, 2025
SAILలో కన్సల్టెంట్ పోస్టులు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దుర్గాపుర్ (<
News December 19, 2025
మన కోరికలకు 108కి ఏంటి సంబంధం?

మనిషికి సాధారణంగా 108 భూసంబంధమైన కోరికలు, 108 రకాల భావాలు ఉంటాయని నమ్మకం. ఈ 108 భావాలలో 36 గతానికి, 36 వర్తమానానికి, మిగిలిన 36 భవిష్యత్తుకు సంబంధించినవిగా భావిస్తారు. అలాగే శరీరానికి జీవాన్నిచ్చే మర్మ బిందువుల సంఖ్య కూడా నూట ఎనిమిదే. ఈ 108 కోరికలు, భావాలు, మర్మ బిందువులపై నియంత్రణ సాధించినప్పుడు, మనం కోరికల బంధం నుంచి విముక్తి పొంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయి.


