News August 14, 2025

పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్‌ఆర్ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఆర్&ఆర్, భూ సేకరణపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. ఏలూరు జిల్లాలో 5 వేలు ఎకరాలు భూమి అవసరం కాగా ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో 1400 ఎకరాలను గుర్తించామన్నారు. భూ సేకరణ పనులు ఈ నెల 15 కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు.

Similar News

News August 14, 2025

హుజూర్‌నగర్ విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

image

తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల ప్రవేశ పరీక్షలలో హుజూర్‌నగర్‌కి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి అర్హత పరీక్షలలో జిల్లా నుంచి తొలి దశలోనే ఎంపిక అయ్యారు. కోలపూడి శ్రీమాన్, పంగ శ్యామ్ కుమార్, కోలపూడి తమన్‌లు రాష్ట్రస్థాయి పోటీలలో విజయం సాధించారు. అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.

News August 14, 2025

NTR, హృతిక్ ‘వార్-2’ రివ్యూ & రేటింగ్

image

శత్రువులుగా మారిన మిత్రులు విక్రమ్(NTR), కబీర్(హృతిక్) దేశం కోసం ఒక్కటై విదేశీ కుట్రను ఎలా తిప్పికొట్టారనేదే ‘వార్-2’ స్టోరీ. NTR, హృతిక్ స్క్రీన్ ప్రజెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్షన్, క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. వార్-1 ఇంట్రో లేకపోవడం, ఊహించే సీన్లు, కొన్నిచోట్ల డబ్బింగ్‌ సమస్య, పూర్ VFX మైనస్‌. స్పై యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారికే నచ్చుతుంది.
Way2News రేటింగ్-2.5/5

News August 14, 2025

శ్రీకాకుళం: ఒకే కాన్పులో రెండు దూడలు

image

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలోని రామాలయం వీధిలో రైతు కృష్ణారావుకు చెందిన ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. గురువారం జరిగిన ఈ అరుదైన సంఘటనతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రెండు దూడల్లో ఒకటి ఆడది, మరొకటి మగది అని రైతు తెలిపారు. తల్లి గోవు, 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. గోవును దైవంగా భావించే తనకు ఈ విషయం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.