News June 25, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు అంతర్జాతీయ నిపుణులు

image

పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను త్వరలో అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలించనుంది. ఈ నెల 27న రాష్ట్రానికి కేంద్ర జలశక్తి శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టు పరిశీలనకు అమెరికా, కెనడా దేశాలకు చెందిన నలుగురు ఇంజినీరింగ్‌ నిపుణుల బృందం రానుంది. ప్రాజెక్టు వద్ద ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి సవాలుగా ఉన్న డయాఫ్రంవాల్‌, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీ అంశాలను పరిశీలించనున్నారు.

Similar News

News June 29, 2024

ప.గో: దారికాసి యువకుడిపై రాడ్లతో దాడి

image

దారికాసి మరీ యువకుడిపై ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన ప.గో జిల్లా తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎం.రామ్మూర్తి శుక్రవారం బైక్‌పై వెళుతుండగా, అదే గ్రామానికి చెందిన ముత్యాల సుబ్బారావు, ముత్యాల సాయి మరికొందరితో కలిసి అడ్డగించారు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్లుతో వెంటపడి మరీ కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News June 28, 2024

‘కల్కి2898 AD’ టీంలో మన ఏలూరు కుర్రోడు

image

రెబల్‌స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి2898 AD’ మూవీలో కీలకమైన బుజ్జి రోబోని డిజైన్ చేసిన సభ్యులలో మన ఏలూరు జిల్లా కుర్రోడు ఒకరవడం విశేషం. చింతలపూడి మండలం బోయగూడెం గ్రామానికి చెందిన రాకేష్ విశాఖపట్టణంలోని గీతం కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ టీహబ్లో వర్క్ చేస్తున్నాడు. కల్కి మూవీలోని రోబో తయారీలో భాగస్వామ్యం అయినందుకు పలువురు అతణ్ని అభినందిస్తున్నారు.
☛ CONGRATS రాకేష్

News June 28, 2024

ప.గో: విషాదం.. పొలంలోనే ప్రాణాలొదిలిన రైతు

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం వదలిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. టి.గంగయ్య(50) అనే రైతు ఉదయం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. కరెంట్ స్తంభం నుంచి తెగిపోయి నీటిలో పడి ఉన్న తీగను గమనించకుండా పొలంలో దిగాడు. షాక్ కొట్టడంతో పొలంలోనే గంగయ్య ప్రాణాలు వదిలాడు. గంగయ్య భార్య చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని స్థానికులు తెలిపారు.