News January 11, 2026
పోలవరం స్పిల్‌వేకు ద్రవిడియన్ తోరణాలు!

AP: పోలవరం తొలిదశను 2027 ఉగాది నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు గతంలో అనుకున్న జూన్ లక్ష్యాన్ని మార్చి నాటికి కుదించాలని అధికారులకు ఆదేశించారు. దీనికి నిర్మాణ సంస్థ మేఘా సైతం అంగీకరించింది. ఇదే సమయంలో పోలవరం స్పిల్‌వేను ద్రవిడియన్ శైలిలో ఉన్న తోరణాలతో అలంకరించేందుకు డిజైన్లను సదరు సంస్థ CMకు చూపించింది. వీటిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Similar News
News February 15, 2026
ఘనవిజయం.. సూపర్-8లోకి వెస్టిండీస్, ఇంటికి నేపాల్

T20WC: నేపాల్‌పై వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత నేపాల్ 20 ఓవర్లలో 133/8 రన్స్ చేసింది. దీపేంద్ర సింగ్ ఒక్కడే 58 పరుగులతో రాణించారు. అనంతరం విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ హోప్ (61*), హెట్మెయిర్ (46*) రాణించారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-C నుంచి సూపర్-8కి వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. అటు నేపాల్ ఎలిమినేట్ అయింది.
News February 15, 2026
నిష్కల్మష భక్తికి నిలువుటద్దం ‘భక్త కన్నప్ప’

శ్రీకాళహస్తి అడవుల్లో తిన్నడు అనే బోయవాడు శివుని భక్తుడు. అమాయక భక్తితో శివలింగానికి నోటి నీటితో అభిషేకం చేసి, వేటాడిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు. అతని భక్తిని లోకానికి చాటాలని శివుడు లింగం కంటి నుంచి రక్తం కార్చాడు. దీంతో తిన్నడు తన కంటిని పెకిలించి దేవునికి అర్పించాడు. రెండో కన్ను కూడా రక్తం కారగా రెండో కంటిని తీయబోతుండగా శివుడు ప్రత్యక్షమై అతడిని ఆపి కన్నప్పగా దీవించి మోక్షం ప్రసాదించాడు.
News February 15, 2026
120 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

BSNL 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెలికం విభాగంలో 95, ఫైనాన్స్ విభాగంలో 25 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/BTech(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://bsnl.co.in/


