News February 10, 2026
పోలవరానికి రూ.32వేల కోట్లు ఇవ్వాలి: సీఎం

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి CR పాటిల్‌తో భేటీ అయ్యారు. పోలవరానికి సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అదనంగా ₹32K కోట్లు ఇవ్వాలన్నారు. ‘నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలి. AP-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలి. కృష్ణాపై కర్ణాటక చేపడుతున్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు పనులను అడ్డుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 21, 2026
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.
News February 21, 2026
ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం: KTR

TG: SLBC సొరంగం కూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. ‘మృతదేహాల వెలికితీతలో, సొరంగం పనుల్లో పురోగతి లేకపోవడం రేవంత్ చేతకానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నేతలు కమీషన్లపై పెట్టే శ్రద్ధ.. ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావు’ అని ట్వీట్ చేశారు. 2025 FEB 22న జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
News February 21, 2026
బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.


