News February 24, 2025
పోలింగ్ కిట్ల పంపిణీకి ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

ఉమ్మడి గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గుంటూరు జడ్పీలో భద్రపర్చిన పోలింగ్ కిట్లను రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ నాగలక్ష్మీ సోమవారం పరిశీలించారు. మెటీరియల్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సీరియల్ నెంబర్లు వేసి వాటిని పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్దం చేయాలని చెప్పారు. 26 నుంచి ఏసీ కళాశాలలో కిట్ల పంపిణీ కోసం ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని చెప్పారు.
Similar News
News February 25, 2025
కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమర్ధవంతంగా నిర్వహించాలని ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మీ ఆదేశించారు. కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, పర్యవేక్షణ అధికారులకు సోమవారం కలెక్టరేట్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో అభ్యర్ధి విజయం సాధించాలంటే పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఒక్క ఓటు అధికంగా రావాల్సి ఉందన్నారు. ఓట్లు లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు.
News February 24, 2025
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తాం: వైఎస్ జగన్

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. జగన్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని, టీడీపీ ఇస్తామన్న పథకాలన్నీ మోసాలుగా మిగిలిపోయాయని అన్నారు.
News February 24, 2025
3 పతకాలతో సత్తాచాటిన పవర్ లిఫ్టర్ చంద్రిక

ఫిబ్రవరి 20 నుంచి 23వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సీనియర్ నేషనల్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ పవర్ లిఫ్టర్ బొలినేని చంద్రిక 84 కేజీల విభాగంలో 3 పతకాలు సాధించింది. పతకాలు సాధించిన చంద్రికను ఆమె కోచ్ నరేంద్ర రాజుని జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ వంశీకష్ణ, రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అభినందించారు.