News May 1, 2024

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

ప్రకాశం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను మంగళవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకొల్లులో ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Similar News

News April 5, 2026

ప్రకాశం: జూన్‌లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

image

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

News April 5, 2026

ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రముఖ ‘సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుందని తెలిపారు.

News April 5, 2026

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్‌లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.