News February 17, 2025
పోలింగ్ కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం: కలెక్టర్

ఫిబ్రవరి 27న ఉమ్మడి కృష్ణా-గుంటూరు శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్‌ల పాత్ర కీలకమని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్‌ల శిక్షణ కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.
Similar News
News November 6, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.
News November 6, 2025
HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.
News November 6, 2025
పిడుగురాళ్లలో వ్యక్తి దారుణ హత్య

పిడుగురాళ్ల లెనిన్ నగర్‌కు చెందిన కొమ్ము సంతోష్ రావును స్నేహితుడు సుభాని బండరాళ్లతో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సంతోష్ రావు బలవంతం చేయగా సుభాని నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


