News February 26, 2025
పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు: ఎస్పీ

జిల్లాలోని గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ రూపేష్ బుధవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉండాలని పేర్కొన్నారు. కేంద్రాల సమీపంలో ప్రచారం చేయవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 27, 2025
స్టార్ కపుల్ మధ్య వివాదం.. కేసులు నమోదు

మహిళా బాక్సర్ సావీటీ బూరా తన భర్త, మాజీ కబడ్డీ ప్లేయర్ దీపక్ హుడాపై పీఎస్లో ఫిర్యాదు చేశారు. వరకట్నం కోసం వేధించారని సావీటీ ఫిర్యాదు చేయడంతో హరియాణా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పుట్టింటి నుంచి SUV, రూ.కోటి తేవాలని తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. సావీటీపై హుడా కూడా కేసు పెట్టారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కాగా హుడా(2020), సావీటీని(2025) కేంద్రం అర్జున అవార్డులతో సత్కరించింది.
News February 27, 2025
జనగామ: నేడు డయల్ యువర్ డీఎం

ఆర్టీసీ జనగామ డిపోలో గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘన్పూర్, నర్మెట్ట, తరిగొప్పుల, రఘునాధపల్లి, మద్దూర్, పాలకుర్తి మండలాల పరిధిలో గల గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలకు సంబంధించి తమ తమ సమస్యలతో పాటుగా సూచనలను తెలియజేయాలన్నారు. 9959226050 నెంబర్ను సంప్రదించాలన్నారు.
News February 27, 2025
మెదక్: MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.