News December 15, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్స్‌కు నో: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరగనున్న మూడవ విడత ఎన్నికల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, కార్డులెస్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు లేదా ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Similar News

News December 15, 2025

కవ్వాల్‌లో ఆధార్ స్పెషల్ క్యాంప్ ప్రారంభం

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామపంచాయతీలో అత్యవసర ఆధార్ ప్రత్యేక శిబిరం సోమవారం ప్రారంభమైంది. మంగళవారం కూడా కొనసాగుతుందని జన్నారం పోస్టల్ శాఖ ఏఎస్పీ రామారావు తెలిపారు. ఈ శిబిరంలో ప్రజలు తమ ఆధార్ కార్డుల్లోని తప్పుల సవరణ, ఫొటో అప్‌డేట్, చిరునామా, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ మార్పులు వంటి అన్ని ముఖ్య సేవలను తక్షణమే వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News December 15, 2025

మెస్సీ టూర్‌పై బింద్రా కీలక వ్యాఖ్యలు

image

ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ <<18570934>>ఇండియా టూర్‌<<>>పై ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, ఆయన ప్రయాణం కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అని తెలిపారు. అయితే తాత్కాలిక ప్రదర్శనలు, ఫొటోల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెడుతున్న శ్రద్ధలో కొంచెమైనా గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధిపై పెడితే బాగుంటుందన్నారు.

News December 15, 2025

కూతురు సర్పంచ్.. తండ్రి ఉపసర్పంచ్..

image

TG: జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామంలో కూతురు సర్పంచ్, తండ్రి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ బలపరిచిన గొల్లపల్లి అలేఖ్య సర్పంచ్‌గా గెలిచారు. ఉపసర్పంచ్ ఎన్నికలో వార్డు సభ్యులు కాంగ్రెస్, BRS అభ్యర్థులకు సమానంగా మద్దతు తెలపడంతో సర్పంచ్ అలేఖ్య తన ఓటును తండ్రి పర్శయ్య (BRS మద్దతుదారు)కు వేశారు. దీంతో ఆయన ఉప సర్పంచ్‌గా విజయం సాధించారు.