News February 13, 2026
పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు: సీపీ

వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఐదు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలని సిపి సన్‌ప్రీత్ సింగ్ అధికారులను ఆదేశించారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని, కేవలం అనుమతి పత్రాలు ఉన్నవారినే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలని స్పష్టం చేశారు.
Similar News
News February 14, 2026
మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
News February 14, 2026
సింగరేణిలో డంప్‌మెన్ పోస్టులకు పరీక్ష

సింగరేణి రామగుండం-2 ఏరియాలో డంప్‌మెన్ (ట్రిప్‌మెన్) ఖాళీల భర్తీకి సెకార్-3 సింగరేణి స్కూల్‌లో అంతర్గత పరీక్ష నిర్వహించారు. 23 మందికి గానూ 21 మంది హాజరయ్యారు. ఎస్.ఓ టు జీఎం సంతోష్ కుమార్ ప్రశ్నపత్రాల సీలును తెరిచారు. ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్, డీవైపీఎం వంశీధర్, ప్రిన్సిపల్ సుందర్ రాజు పాల్గొన్నారు. ఏఎస్ఓ షరీఫ్ మహ్మద్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
News February 14, 2026
ప్రొద్దుటూరు: నెహ్రూ రోడ్డులో దారుణ హత్య

ప్రొద్దుటూరు పట్టణం నెహ్రూ రోడ్డులో శుక్రవారం రాత్రి సుబ్బు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సుబ్బు బేల్దారి పని చేస్తుంటాడని స్థానికులు తెలిపారు. సుబ్బు, వినయ్ మద్యం తాగి గొడవ పడినట్లు, ఈ గొడవ హత్య వరకు వెళ్లిన్నట్లు సమాచారం. 3వ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


