News December 16, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు!

image

ఈనెల 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించారు.

Similar News

News December 18, 2025

RFCL 36పోస్టులకు నోటిఫికేషన్

image

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (<>RFCL<<>>) 36 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 15వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని JAN 22వరకు పంపాలి. పోస్టును బట్టి BE/B.TECH, BSc(Eng), MSc(కెమిస్ట్రీ), PG డిప్లొమా(మెటీరియల్స్ మేనేజ్‌మెంట్), MBA, బీఫార్మసీ, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

News December 18, 2025

పుట్టినరోజే మృత్యువు ఒడిలోకి..

image

పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన ఆ ఇంట విషాదం నిండింది. డోన్‌లోని చాకిరేవు మిట్ట సమీపంలో బుధవారం లారీ, బైక్‌ ఢీకొన్న ఘటనలో కనపకుంట గ్రామానికి చెందిన హరి (15) అక్కడికక్కడే మృతి చెందాడు. తన పుట్టినరోజు కావడంతో వేడుకల కోసం కేక్‌ కొనుగోలు చేసేందుకు హరి పట్టణానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కళ్లముందే ఎదిగిన కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News December 18, 2025

ఇతిహాసాలు క్విజ్ – 100

image

ఈరోజు ప్రశ్న: ఏ రాక్షస రాజు తన తపస్సు ద్వారా మహావిష్ణువును మెప్పించి, తన శరీరం అన్ని తీర్థాల కంటే పవిత్రంగా ఉండాలనే వరం పొందాడు? చివరికి విష్ణువు పాదం మోపడం ద్వారా ఆ అసురుడు ఏ పుణ్యక్షేత్రంగా మారాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>