News March 26, 2024

పోలింగ్ నిర్వహణలో అధికారులు, సిబ్బందే కీలకం: కలెక్టర్

image

సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించడంలో పోలింగ్ అధికారులు, సిబ్బందే అత్యంత కీలకమని గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఎన్నికల విధులకు సిబ్బంది కేటాయింపు, శిక్షణలకు సంబంధించి సోమవారం అధికారులతో మాట్లాడారు. పోలింగ్ రోజు విధులు నిర్వహించే అధికారులు, ఇతర సిబ్బందికి సంబంధించి రాండమైజేషన్ చేపట్టాల్సి ఉందన్నారు.

Similar News

News April 10, 2025

గుంటూరులో గుర్తుతెలియని మృతదేహం.!

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కోడిగుడ్డు సత్రం వద్దనున్న సాంఘిక సంక్షేమ కార్యాలయం వద్ద సుమారు 30ఏళ్ల వయస్సు కలిగిన యువకుడు బుధవారం చనిపోయి పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి వివరాల కోసం పరిసర ప్రాంతాల్లో విచారించినా ఫలితం దక్కలేదు. దీంతో గుర్తుతెలియని మృతదేహంగా నిర్ధారించుకుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చూరీలో భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిస్తే చెప్పాలన్నారు.

News April 10, 2025

తాడేపల్లి: ఇప్పటంలో విషాదం.. ఇద్దరి చిన్నారుల దుర్మరణం 

image

తాడేపల్లి (M) ఇప్పటంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ గోతిలో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం (D) అద్దంకి నుంచి పనికోసం ఓ కుటుంబం ఇక్కడికి వచ్చింది. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్ గోతిలో పడి చనిపోయారు. విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచి బాధిత కుటుంబం, చిన్నారుల మృతదేహాలను అద్దంకికి పంపించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు విచారణ చేపట్టారు.

News April 9, 2025

తెనాలిలో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

image

ఇతర ప్రాంతాల నుంచి తెనాలికి గంజాయి తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రమేశ్ బాబుతో కలిసి డీఎస్పీ జనార్ధనరావు నిందితుల వివరాలను తెలిపారు. గుంటూరుకు చెందిన రాజశేఖర్ రెడ్డి ,పేరేచర్లకు చెందిన అరుణ్ కుమార్, తెనాలికి చెందిన ప్రకాశ్ బాబు ఇతర ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయాలు జరుపుతుండగా అరెస్టు చేసి 1.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

error: Content is protected !!