News December 14, 2025
పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది: ఎస్పీ

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలియజేశారు. ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు పోలీసు సిబ్బంది తమ వంతుగా సహాయ సహకారాలు అందించారన్నారు. వృద్ధులు ఓటు వేయడానికి రాగా వీల్ చైర్లలో కూర్చోబెట్టుకొని పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహాయ సహకారాల పట్ల అన్ని పోలింగ్ కేంద్రాల్లో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారన్నారు.
Similar News
News December 15, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓తుది విడత ఎన్నికలకు ఏర్పాటు పూర్తి: కలెక్టర్
✓3వ విడత ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
✓బూర్గంపాడు: ట్రాక్టర్ బోల్తా యువకుడు మృతి
✓జూలూరుపాడు గ్రామపంచాయతీకి ఎన్నికలు లేవు
✓ఓటును అమ్ముకోవద్దు అంటూ ఆళ్లపల్లిలో యువకుడి ప్రచారం
✓పుస్తకాల కోసం పీఓ రూ.45 వేల చెక్ అందజేత
✓భద్రాచలం: మహిళ ఆత్మహత్యాయత్నం సెల్ఫీ వీడియో
✓కౌలు రైతులు ఆన్లైన్ చేసుకోవాలి: పినపాక ఏఈఓ
✓రెండవ విడతలో 154 సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక
News December 15, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎస్పీ దిశానిర్దేశం

నూతనంగా ఎంపికైన పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు (SCTPCs) జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో అభ్యర్థులతో ఆయన సమావేశమయ్యారు. శిక్షణ కాలంలో పాటించాల్సిన క్రమశిక్షణ, నియమ నిబంధనలు, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. ఉత్తమ పోలీస్ అధికారులుగా సేవలందించాలని అభ్యర్థులను ఎస్పీ ఆకాంక్షించారు.
News December 15, 2025
జిల్లాలో నిషేధాజ్ఞలు అమలు: కలెక్టర్

ఎన్నికల ప్రశాంతత కోసం జిల్లాలో నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉన్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, లౌడ్ స్పీకర్లు, ప్రచార సామగ్రి వాడకంపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఈ ఉత్తర్వులు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తాయని, ఆయుధాలు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.


