News November 11, 2025

పోలింగ్ ప్రారంభం

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మొత్తం 4,01,365 మంది ఓటర్లున్నారు. సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ స్టేషన్ల వద్ద 2,060 మంది పోలీసులు, CRPF సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అటు బిహార్‌లో చివరి విడతగా 122 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.

Similar News

News February 19, 2026

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

image

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్‌గా కూంబింగ్ కొనసాగుతోంది.

News February 19, 2026

ఇండియాలోనూ ఇలాంటి మార్పులు కావాలా?

image

ఇండియాలోనూ జపాన్ తరహా మార్పులు రావాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దగ్గర పిల్లలు ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్‌కు అలవాటు పడ్డారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వంటి ముప్పుకు దారితీస్తోందని హెచ్చరిస్తున్నారు. దీనిని అరికట్టేందుకు జపాన్‌లోని పాఠశాల క్యాంటీన్లలో ప్రాసెస్డ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను నిషేధించినట్లు తెలిపారు. దీనిపై మీ కామెంట్?

News February 19, 2026

వంటింటి చిట్కాలు మీ కోసం

image

* కూరగాయలు వడలిపోయినట్టు అయితే, నీటిలో వేసి నిమ్మరసం పిండితే కాసేపటికి తాజాగా మారతాయి. * వంటకాల్లో ఉల్లివాసన ఎక్కువగా రాకుండా ఉండాలంటే వాటిని వేయించే ముందు కొద్దిగా పంచదార వేయాలి. * పూరీలు మృదువుగా రావాలంటే పిండిని వేడి నీళ్ళూ, పాలతో కలిపి అరగంట సేపు రుమాలులో చుట్టి ఉంచాలి. * పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే, తోడుకున్నాక దానిపై ఒకటి రెండు చిన్న కొబ్బరి ముక్కల్ని ఉంచండి.