News March 19, 2024
పోలింగ్ విధులపై అవగాహనతో ఉండాలి: తిరుపతి కలెక్టర్

పోలింగ్ విధులపై అధికారులు పూర్తి అవగాహణ కలిగి ఉండాలని తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలన్నారు. లోటుపాట్లు లేకుండా పోలింగ్ విధులకు సిద్ధం కావాలన్నారు.
Similar News
News December 30, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

రవి సీజన్లో పంటల సాగు జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలకు అవసరమైన 2183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
చిత్తూరులో తగ్గిన నేరాల శాతం: SP

చిత్తూరు జిల్లాలో 2025 సంవత్సరంలో నేరాల శాతం తగ్గినట్టు ఎస్పీ తుషార్ తెలిపారు. పోలీసు శాఖ వార్షిక నివేదికను ఆయన తెలియజేశారు. గత సంవత్సరం 7034 కేసులు నమోదు కాగా, ఈసారి 5216 నమోదు అయ్యాయని, 26% తగ్గుదల కనిపించిందని చెప్పారు. రూ. 2 కోట్లు విలువచేసే 1021 మొబైల్ ఫోన్లను బాధితులకు అందించామన్నారు. సైబర్ బాధితులకు రూ. 68 లక్షలు రికవరీ చేసి అందజేశామన్నారు.
News December 30, 2025
చిత్తూరు జిల్లా పరిపాలన పునర్వ్యవస్థీకరణ

పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో ఉన్న బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మార్పు 2025 డిసెంబర్ 31 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు గెజిట్‌లో ఉత్తర్వులు ప్రచురించనున్నారు. ఈ మార్పుతో బంగారుపాలెం మండల ప్రజలకు చిత్తూరు కేంద్రంగా పరిపాలనా సేవలు అందనున్నాయి.


