News February 26, 2025

పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధం: ASF కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీకి సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం ASF కలెక్టరేట్‌లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. ఎన్నికల కొరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్‌లతో పాటు అదనంగా బాక్స్‌లను కేటాయించినట్లు చెప్పారు.

Similar News

News October 19, 2025

ముడతలు తొలగించే గాడ్జెట్

image

వయసు పెరిగే కొద్దీ కొంతమందికి చర్మంపై ముడతలు, మొటిమలు వంటివి వస్తాయి. వీటిని తగ్గించడానికి ఫేషియల్ నెక్ మసాజర్ ఉపయోగపడుతుంది. ఈ గాడ్జెట్‌ని ఉపయోగించే ముందు మాయిశ్చరైజర్/ సీరమ్‌ ముఖం, మెడకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మసాజ్ చెయ్యాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుతాయి. డబుల్ చిన్ తగ్గించడంలో కూడా ఈ మసాజర్ ఉపయోగపడుతుంది.

News October 19, 2025

IND vs AUS: 35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేను వర్షం వల్ల 35 ఓవర్లకు కుదించారు. ప్రతి బౌలర్ గరిష్ఠంగా 7ఓవర్లు వేసే అవకాశం ఉంది. 12.20PMకు మ్యాచ్‌ రీస్టార్ట్ అయింది. వర్షం కారణంగా మ్యాచ్ ఇప్పటి వరకు రెండుసార్లు నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో అయ్యర్(6), అక్షర్ పటేల్(7) ఉన్నారు.11.5 ఓవర్లకు భారత్ స్కోర్ 37/3గా ఉంది.

News October 19, 2025

ముదిగుబ్బలో యువకుడు ఆత్మహత్య

image

ముదిగుబ్బలో ఆదివారం ఉదయం రమేష్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడి భార్య కుమారుడితో కలిసి ఇదే గ్రామంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో అతను తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి కార్మికుడు పనికోసం రమేష్ ఇంటికి వెళ్లి చూడగా ఉరివేసుకుని వేలాడుతున్నాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.