News December 12, 2025
పోలియో నిర్మూలనకు సమన్వయమే కీలకం: DRO

పోలియో నిర్మూలన కార్యక్రమంలో అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఏక మురళి శుక్రవారం ఆదేశించారు. జిల్లా రెవెన్యూ కార్యాలయంలో పల్స్ పోలియోపై జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు అందించాలన్నారు. ఇటుక బట్టీలు, వలస కుటుంబాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
Similar News
News December 16, 2025
ADB: మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు చిక్కారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా పోలీసులకు చిక్కినట్లు సమాచారం. పట్టుబడ్డ బడే చొక్కారావుతో పాటు 15 మంది మావోయిస్టులు సిర్పూర్(యూ)లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, ఏడుగురు పురుషులు ఉండగా, మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించారు.
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: సిద్దిపేట సీపీ

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కేసులు నమోదుకానున్నాయని CP విజయ్‌కుమార్ ప్రకటించారు. విజయోత్సవాల్లో పటాకులు కాల్చడం, అనుమతి లేని ర్యాలీలు నిర్వహించడం, ప్రభుత్వ అధికారుల పనికి ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి దశ ఎన్నికల్లో 20 కేసులు, రెండవ దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
News December 16, 2025
15 బంతుల్లో హాఫ్ సెంచరీ..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ మరోసారి చెలరేగారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. మొత్తంగా 22 బంతుల్లో 73 రన్స్ బాదారు. ఇందులో 7 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. తొలుత రాజస్థాన్ 216/4 స్కోర్ చేయగా, ముంబై 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో బ్యాటర్ రహానే 41 బంతుల్లో 72* రన్స్ చేశారు.


