News August 29, 2025

పోలీసులపై MLA కోటంరెడ్డి ఆగ్రహం?

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని <<17554192>>హత్య <<>>చేసేందుకు కొందరు మాట్లాడిన వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. హత్య కుట్రకు సంబంధించి పోలీసుల వద్ద సమాచారం ఉన్నా తనకు ఎందుకు చెప్పలేదని వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై తనను ఇకపై కలిసే ప్రయత్నం చేయవద్దని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. హత్య కుట్రపై శనివారం ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడతారని సమాచారం.

Similar News

News August 29, 2025

కోటంరెడ్డికి హోం మంత్రి ఫోన్

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హోం మంత్రి అనిత ఫోన్ చేశారు. రౌడీ షీటర్లు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై ఎమ్మెల్యేతో ఆమె మాట్లాడారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీడియోలో ఉన్న నిందితులను వెంటనే పట్టుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

News August 29, 2025

గిడుగు ఆలోచనలను అర్థం చేసుకోవాలి: మాజీ ఉపరాష్ట్రపతి

image

భవిష్యత్ తరాలకు మాతృ భాష మాధుర్యాన్ని చేరువ చేసేందుకు సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరు టౌన్ హాలులో తెలుగు భాష ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గిడుగు ఆలోచనను సరైన కోణంలో అర్థం చేసుకోవాలని సూచించారు. వాడుక భాష వాడకం పెరగడంతో పాటు, మన ప్రాచీన సాహిత్యాన్ని సైతం అందరికీ అందుబాటులోకి తీసుకు రావడానికి అందరూ కృషి చేయాలని కోరారు.

News August 29, 2025

ఒంటరితనంతో మాజీ MP మేనల్లుడి ఆత్మహత్య

image

ఒంటరితనం భరించలేక మాజీ MP P.సుందరయ్య చెల్లెలి కుమారుడు D.చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌కు చెందిన ఈయన ఈ ప్రైవేట్ కంపెనీలో పని చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. కొద్ది రోజులుగా HYDలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన అక్కడి నుంచి బయటికి వచ్చి ఖమ్మం(D) మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి చనిపోయారు. డెడ్ బాడీని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.