News July 1, 2024

పోలీసులు అనుమతి తప్పనిసరి: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా 30 పోలీస్ యాక్ట్‌ను సోమవారం నుంచి అమలుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని పోలీసుల ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు, సభలు ,ర్యాలీలు నిర్వహించవద్దని శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News July 3, 2024

మాజీ సీఎంను కలిసిన నిర్మల్ నేతలు

image

మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మంగళవారం ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కొరిపల్లి విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ సూచించారు.

News July 2, 2024

నిర్మల్: ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి

image

సారంగాపూర్ మండలం అడేల్లిపోచమ్మ ఆలయ సమీపంలో గల రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రమాదవశాత్తు బండరాయిపై పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కౌట్ల(బి) గ్రామానికి చెందిన భీమన్న అనే వ్యక్తి మంగళవారం పోచమ్మ ఆలయం వద్ద గ్రామస్థులు పండుగ చేయగా అక్కడికి వెళ్ళాడు. మోదుగ ఆకులు తెంపడానికి రిజర్వ్ ఫారెస్ట్‌కు వెళ్లగా ప్రమాదవశాత్తు బండరాయిపై జారిపడ్డాడు.

News July 2, 2024

ADB: వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

ఆదిలాబాద్ తిర్పల్లిలోని ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన దాదాపు వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం టూటౌన్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ అశోక్ గోదామును పరిశీలించి నిల్వలను గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అప్పగించామన్నారు. సిబ్బంది నరేష్, రమేష్, క్రాంతి ఉన్నారు.