News March 26, 2025
పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు.
Similar News
News March 29, 2025
ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్న అంజనప్ప

అనంతపురం జిల్లాకు చెందిన తేనే తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.అంజనప్ప శుక్రవారం ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. కనుమరుగవుతున్న కళా రూపాలకు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలలో 221 కళాభిషేకం కార్యక్రమాలు పూర్తి చేసినందుకుగాను ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డు అవార్డు దక్కిందని తెలిపారు.
News March 29, 2025
గుంతకల్లు: రైల్లో ప్రయాణికుడి మృతి

గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు సమీపంలో ఇంటర్ సిటీ రైల్లో ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(59) శుక్రవారం మృతి చెందాడు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటికి చెందిన ఈయన.. ఈనెల రెండో తేదీన గోవా వెళ్లాడు. తిరిగి సొంతూరుకు వెళ్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని తాడిపత్రిలో రైల్వే ఎస్ఐ నాగప్ప, పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు.
News March 29, 2025
రూ.18.17 లక్షల విలువ చేసే 10 డ్రోన్ కెమేరాలు వితరణ

కమ్యునిటీ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా స్వచ్చంధంగా ముందుకు వచ్చి రూ.18.17 లక్షల విలువ చేసే 10 డ్రోన్ కెమెరాలను అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఎస్పీ జగదీశ్‌కు అందజేశారు. తాడిపత్రికి చెందిన అర్జాస్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఎస్పీ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. పోలీసు విధులకు టెక్నాలజీతో కూడిన డ్రోన్ల సేవలు తోడైతే జిల్లా ప్రశాంతంగా ఉంచేందుకు వీలుంటుందని అన్నారు.