News October 26, 2025

పోలీసుల ఎదుట 21 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రేంజ్ కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మొత్తం 18 ఆయుధాలను మోసుకెళ్లిన ఈ 21 మంది మావోయిస్టులు జన స్రవంతిలో చేరారు. వీరందరూ కేశ్కల్‌ డివిజన్‌లోని కుమారి/కిస్కోడో ఏరియా కమిటీకి చెందినవారు. వీరిలో డివిజన్‌ కార్యదర్శి ముఖేష్‌ కూడా ఉన్నాడు.

Similar News

News October 26, 2025

యాడికి: బైక్‌ను ఢీకొన్న బొలెరో.. వ్యక్తి మృతి

image

యాడికి మండలం రాయలచెరువులోని పెట్రోల్ బంకు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాయలచెరువుకు చెందిన పుల్లయ్య మోడల్ స్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేసే పుల్లయ్య మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. ఇంటి నుంచి బైక్‌పై మోడల్ స్కూల్‌కు బయలుదేరాడు. వెనుక నుంచి బొలెరో ఢీ కొంది. ప్రమాదంలో పుల్లయ్య మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News October 26, 2025

ఏయూ విద్యార్థులకు 2 రోజులు సెలవులు

image

తుఫాన్ నేపథ్యంలో ఏయూ క్యాంపస్ కళాశాలల విద్యార్థులకు ఈనెల 27, 28వ తేదీల్లో తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ కె.రాంబాబు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని 2 రోజులపాటు సెలవులు ప్రకటించామని, విద్యార్థులు హాస్టల్స్‌లో సురక్షితంగా ఉండాలని సూచించారు. అటు అనకాపల్లి జిల్లాలో 29 వరకు కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

News October 26, 2025

ఎన్టీఆర్: రేపటితో ముగియనున్న గడువు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(NMMS) పరీక్షకై నమోదు చేసుకున్న విద్యార్థులు సోమవారంలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 7న NMMS పరీక్ష నిర్వహిస్తామని, ఈ నెల 31లోపు DEO అధికారి ఎన్టీఆర్ జిల్లా నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తులు ధృవీకరిస్తారని పేర్కొంది. https://portal.bseap.orgలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చంది.