News March 14, 2025
పోలీసుల కస్టడీలో పెద్దపల్లి వాసి అనుమానాస్పద మృతి

నిజామాబాద్‌లో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకుల ప్రకారం.. JGTL చెందిన చిరంజీవి, PDPLకి చెందిన సంపత్ ఇరువురు కలిసి గల్ఫ్‌కు కొందరిని పంపించారు. తీరా అక్కడికి వెళ్లిన వారికి పనిలేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్, చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.
Similar News
News September 16, 2025
భద్రాచలం: APలో కలిశాక ఆ 5 గ్రామాల పరిస్థితి దుర్భరం

AP-TG విభజన సమయంలో APలో కలిసిన 5 గ్రామాల ప్రజల జీవనం ఆగమ్యగోచరంగా మారింది. సరిహద్దుల్లో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ గ్రామాలు భద్రాచలానికి 9 KM, రంపచోడవరంనకు 130 KM దూరంలో ఉన్నాయి. దీంతో విద్యార్థుల చదువులు, అభివృద్ధి దుర్భరంగా తయారయ్యాయంటున్నారు. తమను తిరిగి భద్రాచలంలో చేర్చాలని కోరుతున్నారు.
News September 16, 2025
కామారెడ్డి: ఈ నెల 17న కలెక్టరేట్‌లో జాబ్ మేళా

కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 17న కలెక్టరేట్‌లోని ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికిరణ్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో పని చేయడానికి ఆసక్తి గల వారు జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. 18 నుంచి 25 ఏళ్ల వారు అర్హులని చెప్పారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు.
News September 16, 2025
NZB: 800 గ్రామాలకు నీటి సరఫరాలో అంతరాయం

సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్‌కు మరమ్మతులు జరుగుతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలకు నీటి సరఫరా 2 రోజుల పాటు అంతరాయం ఉంటుందని గ్రిడ్ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 800 గ్రామాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో సుమారు 800 గ్రామాలకు 2 రోజుల పాటు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు.