News February 26, 2025
పోలీసుల తీరు బాగోలేదు: కేతిరెడ్డి

తాడిపత్రిలో పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాను తాడిపత్రికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తమ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొన్ని చోట్ల వారి ఇళ్లను కూడా కూలుస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని హితవు పలికారు.
Similar News
News February 26, 2025
విషాదం.. ఏడ్రోజుల బాలింత మృతి

రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. శివారెడ్డి భార్య పవిత్ర (32) ఏడు రోజుల బాలింత లివర్ ఇన్ఫెక్షన్తో మృతి చెందారు. ఆమె వారం రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం దద్దుర్లు, ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల సూచనలు మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 26, 2025
నాటుసారా రహిత జిల్లాగా తయారు చేద్దాం: అనంత కలెక్టర్

నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.
News February 26, 2025
శివరాత్రి ఉత్సవాలు.. భారీ బందోబస్తు: ఎస్పీ

అనంతపురం జిల్లాలో ఇవాళ (బుధవారం) శివరాత్రి ఉత్సవాలు జరగనున్న ప్రధాన శివాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజలందరు శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఆలయాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తే ఏ ఇబ్బందీ లేకుండా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని వెల్లడించారు.