News September 2, 2025
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యత: ఏఎస్పీ

పోలీసుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తోందని అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మృతి చెందిన ఆరు హోంగార్డు కుటుంబాలకు అడిషనల్ ఎస్పీ రూ.2 లక్షల ప్రకారం కాంట్రిబ్యూషన్ వెల్ఫేర్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా పోలీసు కుటుంబాలకు రావలసిన బెనిఫిట్స్ త్వరితగతిన అందజేస్తామన్నారు.
Similar News
News September 3, 2025
కర్నూలు: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా గోపాలచార్యులు

కర్నూలు(D)కు గర్వకారణంగా సి.బెళగల్ మండలం బురాన్ దొడ్డికి చెందిన ముతుకూరి గోపాలచార్యులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికయ్యారు. తెలుగు పండితుడిగా జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఈయన.. విద్యార్థులతో పాటలు పాడిస్తూ, రాయిస్తూ విద్యను సృజనాత్మకంగా నేర్పుతున్నారు. ఈనెల 5న టీచర్స్ డే సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. గోరంట్లకు చెందిన వీరి కుటుంబంలో 6గురు టీచర్లుండటం విశేషం.
News September 3, 2025
రూ.కోటి విరాళం ప్రకటించిన మంత్రి టీజీ భరత్

అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి టీజీవీ సంస్థల తరఫున రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. అమరావతిలో ఏపీ ప్రభుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్తంగా 58 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటు చేయనున్నాయి. వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి భరత్ ఈ విరాళం ప్రకటించారు.
News September 3, 2025
గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రటిష్ఠ చర్యలు చేపట్టండి: ఎస్పీ

కర్నూలులో గురువారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనం సజావుగా జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్‌తో కలిసి ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.