News August 26, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: SP

image

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ పలు కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో SP వకుల్ జిందల్ నేడు సమావేశం నిర్వహించారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Similar News

News August 26, 2025

విజయనగరం: కరుస్తున్నాయి.. కాటేస్తున్నాయి..!

image

జిల్లాలో పాము కాట్లు, కుక్కల దాడులు భయాందోళన రేపుతున్నాయి. 2024లో 383 మంది పాముకాటుకు గురికాగా ఇద్దరు మరణించారు. 2025 (ఆగస్టు వరకు) 143 కేసులు నమోదయ్యాయి. 2024లో 12,767 కుక్క కాటు కేసులు నమోదవ్వగా నలుగురు చనిపోయారు. 2025 (ఆగస్టు వరకు) 7,545 కేసులు నమోదవ్వగా ఆరుగురు ప్రాణాలొదిలారు. కుక్క, పాముకాట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబీస్, యాంటీ వెనమ్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.

News August 26, 2025

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వ‌ర్షాల ప‌ట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా క‌లెక్ట‌ర్‌ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిషా, శ్రీ‌కాకుళం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో, ముఖ్యంగా నాగావ‌ళి ప‌రీవాహ‌క మండ‌లాల అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. ఎస్‌.కోట‌, నెల్లిమ‌ర్ల మండ‌లాల్లో రేపు అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.

News August 26, 2025

విజయనగరం పోలీసులపై యాక్షన్ షురు..!

image

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుదారుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్ఐలు, ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటు పడింది. విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.కోట రూరల్ సీఐ రవికుమార్‌తో సహా పలువురిపై కేసులు నమోదు కాగా పలువురిని బదిలీలు చేశారు.