News November 10, 2025

పోలీసు ప్రధాన కార్యాలయానికి 66 వినతులు: SP

image

పుట్టపర్తిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి సోమవారం 66 వినతులు అందినట్లు SP సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన లక్ష్యమన్నారు. ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, సైబర్ నేరాలు అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరం న్యాయం చేస్తామన్నారు.

Similar News

News November 10, 2025

షీ టీంపై విద్యార్థులకు అవగాహన సదస్సు

image

ఆకతాయిల వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహిళలకు ఇన్‌స్పెక్టర్ సుజాత వరంగల్‌లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సోమవారం బాల్య వివాహాలు, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించారు. వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా, డయల్ 100 లేదా 8712685142 నంబర్‌కు, లేదా టీ-సేవ్ యాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు.

News November 10, 2025

HYD: అందెశ్రీకి కులం, మతం లేదు..!

image

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీకి కులం, మతం లేదు. ఆయన నలుగురు పిల్లల సర్టిఫికేట్‌లో కూడా కులం ఉండదు. తన గాయాలను కవితలుగా మలిచారు. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతమైంది. ‘జై బోలో తెలంగాణా’ అని గర్జించి పాడితే, ఉస్మానియా జనగర్జనలా మారింది. ప్రజా కవి, నంది అవార్డు గ్రహీతగా 64 ఏళ్ల అందెశ్రీ జీవితం కవిత్వం, క్షోభ, కర్మల సమ్మేళనం.

News November 10, 2025

PDPL: ఆయిల్ పామ్ సాగుతో ‘లాభాల పంట’

image

రైతులు ఆయిల్ పామ్ సాగువైపు అడుగులు వేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శ్రీరాంపూర్‌లో నిర్మాణం జరుగుతున్న తిరుమల ఆయిల్ ఫ్యాక్టరీ 6- 8 నెలల్లో ప్రారంభమవుతుందన్నారు. మొక్క నాటిన తర్వాత 30 ఏళ్ల పాటు రాబడి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. మొదటి 3 సంవత్సరాలు అంతర్ పంటల ద్వారా ఆదాయం, నాల్గో సంవత్సరం నుంచి ఎకరానికి లక్షల్లో లాభాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.