News September 23, 2025
పోలీసు శాఖ పర్యవేక్షణలో దేవి నవరాత్రులు: సీపీ వరంగల్

దేవి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో, దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠమైన భద్రత కల్పిస్తారని తెలిపారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, వేడుకలు జరిగే అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 23, 2025
హైడ్రా యాక్షన్.. ఎలా అయిందో చూడండి.!

గాజులరామారంలో హైడ్రా యాక్షన్‌పై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రూ.15 కోట్ల విలువైన 317 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు తెలిపింది. వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడికి నేల కనిపిస్తోందని చెప్పారు.
News September 23, 2025
డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.
News September 23, 2025
కల్వకుర్తి: భారీగా నల్ల బెల్లం, పటిక పట్టివేత

కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ టోల్ గేట్ వద్ద 300 కిలోల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టుకున్నట్లు ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యనాథ్ చౌహన్ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వాహనంలో 65 బ్యాగులలో నల్ల బెల్లం, 40 కేజీల పటిక గుర్తించగా, మరో వాహనంలో 10 కేజీల నల్ల బెల్లం 10 కేజీల పటిక గుర్తించినట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.