News October 8, 2025

పోలీసు సేవలు మెరుగుపరచాలి: ఎస్పీ నరసింహా

image

సూర్యాపేట: పోలీస్ స్టేషన్ల వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహా బుధవారం 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, పోలీసు పరికరాలు, సిబ్బంది కవాతును ఆయన పరిశీలించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు. అంతకు ముందు ఎస్పీకి డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ వెంకటయ్య, ఎస్‌ఐలు, సిబ్బంది ఎస్పీకి గౌరవ వందనంతో స్వాగతం పలికారు.

Similar News

News October 8, 2025

భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని ఆమె స్పష్టం చేశారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బందితో భూభారతి అమలుపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

News October 8, 2025

ట్రిపుల్ టెస్ట్ సర్వే అంటే ఏంటి?

image

TG: BC రిజర్వేషన్ల‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు ట్రిపుల్ టెస్ట్ సర్వే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. 2021లో వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ MH, ఇతరుల కేసుల్లో SC ట్రిపుల్ టెస్ట్‌ను ఏర్పాటు చేసింది. అదేంటంటే?
✎ OBC వెనుకబాటుతనంపై కమిషన్ ఏర్పాటు చేయాలి.
✎ ఆ కమిషన్ ఇచ్చే డేటా బేస్ చేసుకొని రిజర్వేషన్ % నిర్ణయించాలి.
✎ SC, ST, OBC రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదు.

News October 8, 2025

రాధికను అభినందించిన ఎస్పీ జానకి

image

కాంస్య పతకం సాధించిన అడ్డాకల్ PSకు చెందిన కానిస్టేబుల్ రాధికను MBNR ఎస్పీ డి.జానకి అభినందించారు. హరియాణాలో జరిగిన 74వ ఆల్ ఇండియా పోలీస్ రెజ్లింగ్ క్లస్టర్(ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్)–2025-26లో తెలంగాణ పోలీస్ బృందం తరపున పాల్గొన్న రాధిక 80+ కేటగిరీలో అద్భుత ప్రతిభ కనబరిచి కాంస్య పతకం సాధించారు. దీంతో రాధికను తన చాంబర్‌లో శాలువా కప్పి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.