News January 4, 2026

పోలీస్ అతిథి గృహానికి సంబంధం లేదు: పోలీసు శాఖ

image

తిరుమలలో మద్యం బాటిళ్లు లభ్యమైన ప్రదేశం పోలీస్ అతిథి గృహానికి ప్రత్యక్ష సంబంధం లేదని పోలీస్ శాఖ తెలిపింది. బాలాజీకాలనీ సమీపంలోని పిట్టగోడ వెనుక చెట్లు పొదళ్లో ఉన్నాయి. ఆ ప్రదేశానికి పోలీస్ అతిథి గృహం 25 నుంచి 50 అడుగుల ఎత్తులో ఉంది. అది సాధారణ కార్ పార్కింగ్ అని పోలీసులు వెల్లడించారు. మరో వైపు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని టీటీడీ కూడా స్పందించింది.

Similar News

News February 18, 2026

మిలాన్ ఏర్పాట్లపై సీపీ సమీక్ష

image

విశాఖలో రేపు జరగనున్న మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి స్వయంగా పర్యవేక్షించారు. బీచ్ రోడ్డులోని హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డ్రోన్లు, సీసీటీవీలు, సోషల్ మీడియా డెస్క్, భద్రతా వ్యవస్థల నిఘాను తనిఖీ చేసి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

News February 18, 2026

ఇరాన్‌పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడి?

image

అమెరికా ఇరాన్‌పై త్వరలోనే భారీ మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేయనున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్సియాస్ ఏజెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగితే ఆ ఆపరేషన్ కొన్ని వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేసింది. న్యూక్లియర్, మిసైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే లక్ష్యంగా ఇజ్రాయెల్‌తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.

News February 18, 2026

మార్చి 11న వైవీయూ కాన్వకేషన్ నిర్వహణ: వీసీ

image

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.