News February 24, 2025

పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి సమీక్ష

image

హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర సచివాలయం కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పోలీస్ ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హోమ్ విపత్తుల శాఖకు కావలసిన నిధులపై చర్చించినట్లు ఆమె ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రజారక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు తెలిపారు. వసతుల కల్పన, సంక్షేమం, కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రాధాన్యత ఇచ్చే బడ్జెట్‌ను కూటమి ప్రభుత్వం తీసుకురానున్నట్లు తెలిపారు.

Similar News

News July 6, 2025

సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలంటే?

image

మహిళలు పబ్లిక్ టాయిలెట్లు, ఛేంజింగ్ రూమ్‌లు, హోటల్ గదులకు వెళ్లినప్పుడు అక్కడి <<16963972>>వస్తువులను<<>> నిశితంగా పరిశీలించాలి. గదుల్లో లైట్ ఆఫ్ చేసి, LED లైట్ వంటివి కనిపిస్తాయో చెక్ చేయాలి. అద్దంపై వేలు పెట్టి చూస్తే మీ వేలుకి, అద్దంలో వేలు ప్రతిబింబానికి మధ్య గ్యాప్ లేకపోతే అక్కడ ఏదో ఉందని అనుమానించాలి. సీక్రెట్ కెమెరాల డిటెక్ట్ యాప్‌లు ఉన్నా వాటిలో చాలావరకు మోసపూరితమైనవేనని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

News July 6, 2025

సింహాచలం: 9,10 తేదీల్లో గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ రూల్స్-1

image

➫ సత్యవరం జంక్షన్-అడవివరం జంక్షన్ వరకు, భక్తుల వాహనాలకు అనుమతిస్తారు.
➫ అడవివరం నుంచి హనుమంతువాక జంక్షన్, గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి పాత గోశాల జంక్షన్ వరకు వాహనాలకు అనుమతి లేదు.
➫పెందుర్తి, పినగాడి మీదగా వేపగుంట జంక్షన్ వైపునకు, NAD జంక్షన్ నుంచి గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి వైపునకు భారీ వాహనాలకు అనుమతి లేదు.

News July 6, 2025

గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్- 2

image

➦ అనకాపల్లి నుంచి సిటీ వైపు వచ్చే భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ నుంచి సబ్బవరం మీదుగా ప్రయాణం చేయాలి.
➦09 తేదీ ఉదయం 6 నుంచి అడవివరం, గోపాలపట్నం పెట్రోల్ బంక్ మధ్య వాహనాలకు నో ఎంట్రీ. దువ్వపాలెం, అక్కిరెడ్డిపాలెం, వేపగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించాలి
➦అనకాపల్లి నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్ళు వాహనాలు విశాఖ సిటీలోకి అనుమతి లేదు. లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్ళాలి.