News September 6, 2025
పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన CP

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ శనివారం పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంను సందర్శించారు. ఈ సందర్శనలో కమిషనర్ కంట్రోల్ రూంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, అత్యవసర కాల్స్ స్వీకరణ, స్పందన విధానం, డయల్ 100 కార్యకలాపాలను సమీక్షించారు. కమిషనర్ ప్రజల నుంచి వచ్చే ప్రతి కాల్‌ను అత్యంత జాగ్రత్తగా, తక్షణమే స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News September 6, 2025
VZM: ఎరువుల సరఫరాపై రేపు డయిల్ యువర్ కలెక్టర్

ఎరువుల సరఫరాపై రైతుల సమస్యలు తెలుసుకునేందుకు, వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరించేందుకు ఆదివారం డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని అంబేడ్కర్ ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య 9441957315 నంబరుకు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
News September 6, 2025
రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ‘మ.3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. ఎల్లుండి సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు’ అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.
News September 6, 2025
ANU: ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏప్రిల్ నెలలో జరిగిన ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ 4వ సెమిస్టర్ ఫలితాలు శనివారం అధికారులు విడుదల చేశారు. రీ వాల్యుయేషన్‌కు ఈ నెల 15న చివరి తేదీగా పేర్కొన్నారు. రీ వాల్యుయేషన్‌కు ఒక్కొక్క సబ్జెక్టుకు ఈ నెల 16వ తేదీలోపు రూ.1,860 చెల్లించాలన్నారు.