News December 27, 2024
పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ పకడ్బందీగా నిర్వహిస్తాం: ఎస్పీ

పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 నుంచి ఒంగోలులోని పోలీసు పెరేడ్ మైదానంలో ఎంపిక ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన తేదీ, సమయాల్లో సర్టిఫికెట్లతో రావాలని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
Similar News
News March 2, 2026
FLASH టంగుటూరు: రైలు ఢీకొని మహిళ మృతి

టంగుటూరు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు గుర్తు తెలియని 50 ఏళ్ల మహిళను కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, వివరాలు తెలిస్తే 924757632 నంబర్‌ను సంప్రదించాలని ఒంగోల్ RPF ఎస్‌ఐ శ్రీరాం తెలిపారు.
News March 2, 2026
ప్రకాశం: కెనాల్‌లో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల పరిధిలోని కేసీ కెనాల్‌లో ఆదివారం ప్రమాదవశాత్తు పడి గల్లంతైన ఒంగోలు యువకుడు హేమంత్ (17) మృతదేహం లభ్యమైంది. పోలీస్, అగ్నిమాపక సిబ్బందితో పాటు డ్రోన్ టీం సాయంతో గాలింపు చేపట్టగా, సోమవారం ఈర్నపాడు దగ్గర శవం దొరికినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
News March 2, 2026
మార్కాపురంలో కొత్త కొలువులు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

మార్కాపురంలోని కొత్త వన్ స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి పద్మావతి ఆదివారం తెలిపారు. అర్హత గల మహిళా అభ్యర్థులు మార్చి 11 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు జిల్లా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు తీసుకుని, సర్టిఫికెట్లు జతచేసి జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.


