News August 26, 2025

పోలీస్ కుటుంబాలకు SP అండ.!

image

ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రిటైర్డ్, మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ మురళి కుటుంబ సభ్యులకు ఇన్సిడెంటల్ చార్జెస్ రూ.25వేల చెక్కును ఎస్పీ అందజేశారు.

Similar News

News August 26, 2025

ప్రకాశం: బార్ల దరఖాస్తుల గడువు పెంపు.!

image

ప్రకాశం జిల్లాకు ఓపెన్ కేటగిరిలో కేటాయించబడ్డ 26 బార్ల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ముందుగా 28వ తేదీ గడువు ఉండగా, ప్రభుత్వం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ బార్లకు 30వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ తీస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను సమర్పించాలని కోరారు.

News August 26, 2025

ప్రకాశం జిల్లా ప్రజలకు.. ఎస్పీ కీలక సూచన.!

image

ప్రకాశం జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ మంగళవారం కీలక సూచన చేశారు. ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావులేకుండా ప్రజలు పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఏవైనా అనుకోని ఘటనలు తలెత్తితే.. 112, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.

News August 26, 2025

ప్రకాశం: 5రోజుల పాపను అమ్మబోయిన తండ్రి.!

image

ఐదు రోజుల పాపను అమ్మాలని చూసిన కసాయి తండ్రి వద్ద నుంచి ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారులు పాపను రక్షించిన ఘటన ఒంగోలులో మంగళవారం జరిగింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి తన పాపను అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ఘటనతో సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాపను తమ సంరక్షణలో ఉంచారు. అలాగే మరో ఆరు సంవత్సరాల బాలికను సైతం అధికారులు నేడు రామ్‌నగర్‌లోని శిశు గృహల్లో చేర్పించారు. అధికారులను కలెక్టర్ అభినందించారు.