News September 24, 2024

పోలీస్ గ్రీవెన్స్ డేకు 57 దరఖాస్తులు: ఎస్పీ

image

NLG: ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గ్రీవెన్స్ డేలో భాగంగా ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 57మంది ఆర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News September 29, 2024

కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హనుమంత్ రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో ధరణి, ప్రజావాణి దరఖాస్తులు, వాల్డా చట్టంపై సమీక్షించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ విషయంలో పెండింగ్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, భువనగిరి ఆర్డీఓ అమరేందేర్, చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 28, 2024

మిర్యాలగూడలో రామ్‌నగర్ బన్నీ చిత్ర యూనిట్

image

బుల్లి తెర నటుడు ప్రభాకర్ తనయుడు నటించిన రామ్ నగర్ బన్నీ టీం మిర్యాలగూడలో సందడి చేసింది. పట్టణంలో ఓ కళాశాలలో మూవీకి సంబంధించిన ప్రోమో జరిగింది. ప్రభాకర్‌తో పాటు హీరోహీరోయిన్లు హాజరయ్యారు. నేటి యువతను ఆకర్షించే విధంగా ఈ చిత్రం ఉంటుందని, ప్రతీ ఒక్కరూ సినిమాను ఆదరించాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనాథ్, యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించారు.

News September 28, 2024

సూర్యాపేట: ఆర్టీసీ బస్సులో ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు

image

ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. ప్రయాణికులు తెలిపిన ప్రకారం.. బస్సు సూర్యాపేట నుంచి కోదాడ వెళుతోంది. గుడిబండకు చెందిన అలివేలు అనే గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్, కండక్టర్ అప్రమత్తమై బస్సును పక్కకి నిలిపారు. మహిళా ప్రయాణికులు ఆమెకు సుఖప్రసవం చేశారు. మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.