News August 23, 2025
పోలీస్ నుంచి టీచర్‌గా..

సోమందేపల్లికి చెందిన కానిస్టేబుల్ నరేశ్ డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. 2013లో కానిస్టేబుల్‌గా ఎంపికైన నరేశ్ మొదట పెనుకొండ స్టేషన్‌లో పనిచేశారు. బదిలీపై ముదిగుబ్బ, ప్రస్తుతం సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. బీఈడీ పూర్తి చేసిన నరేశ్ టీచర్ వృత్తిపై అభిమానంతో చదవు కొనసాగించారు. గతంలో రెండు సార్లు డీఎస్సీలో విఫలమైనా తాజాగా సక్సెస్ అయ్యారు.
Similar News
News April 13, 2026
ఆసిఫాబాద్: ఆ కళాశాలలో ఒక్కరూ పాస్ కాలేదు..!

కాగజ్‌నగర్ మండలం బలగాలలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (TEMREIS) ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఈ కళాశాల నుంచి ఎనిమిది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, ఒక్కరు కూడా ఉత్తీర్ణత సాధించలేదు. జిల్లావ్యాప్తంగా ‘జీరో రిజల్ట్’ నమోదైన ఏకైక కళాశాలగా ఇది నిలిచింది. అధికారుల పర్యవేక్షణ లోపం, బోధన వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News April 13, 2026
అనకాపల్లి: ప్రేమ పేరుతో మోసం.. CISF కానిస్టేబుల్ అరెస్ట్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో CISF కానిస్టేబుల్ కె.రాజీవ్ గాంధీని అరెస్ట్ చేసినట్లు అనకాపల్లి సీఐ ప్రేమ్ కుమార్ ఆదివారం తెలిపారు. చీడికాడ మండలానికి చెందిన కానిస్టేబుల్ చోడవరం మండలానికి చెందిన యువతిని అనకాపల్లిలో తన అక్క ఇంటిలో ఉంచి ఆమెను కలిసేవాడు. పెళ్లి విషయం ప్రస్తావించగా నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు యూపీలో పని చేస్తున్న కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశామన్నారు.
News April 13, 2026
మచిలీపట్నం-విజయవాడ హైవేపై ప్రమాదం.. స్పాట్ డెడ్, కారు నుజ్జు

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఉయ్యూరు వద్ద ఉన్న జియో పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున పెను ప్రమాదం సంభవించింది. కానూరుకు చెందిన కారు అదుపుతప్పి ప్రమాదానికి గురవడంతో ప్రయాణికుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


